Darapaneni Narendra was Arrested by CID| టీడీపీ నేత నరేంద్రను అరెస్ట్ చేసిన సీఐడీ | ABP Desam
సోషల్ మీడియా పోస్టుల కేసులో అరెస్టైన టీడీపీ మీడియా ఇన్ ఛార్జి దారపునేని నరేంద్రను సీఐడీ అధికారులు హింసించినట్టు ఆరోపణలు వచ్చాయి. నరేంద్రను సీఐడీ కార్యాలయం నుంచి గుంటూరులోని సీఐడీ న్యాయస్థానానికి తీసుకొచ్చిన సమయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కోర్టు వద్ద తనను కలిసిన న్యాయవాదులు, తెదేపా నేతల ముందు నరేంద్ర కన్నీరు పెట్టుకున్నారు.