Cyrus Mistry Death: టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కన్నుమూత | ABP Desam
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి చెందారు. అహ్మదాబాద్ నుంచి ముంబైకి వస్తున్న మార్గ మధ్యలో... ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. పాల్ఘర్ లోని చరోటి ప్రాంతంలో కారు డివైడర్ ను ఢీ కొట్టడంతో యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సైరస్ మిస్త్రీ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.