CPI Narayana On Chintamani: చింతామణి నాటకాన్ని నిషేధించే నైతిక హక్కు వైసీపీ కి లేదు
చింతామణి నాటకాన్ని నిషేధించే నైతికహక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదని సీపీఐ జాతీయకార్యదర్శి నారాయణ అన్నారు. ఏపీ ప్రభుత్వం చింతామణి నాటకంపై నిషేధం విధించటం అంటే రంగస్థలంపై దాడి చేసినట్లే అన్న నారాయణ....చింతామణి మూలంలో ఎలాంటి కించపరిచే వ్యాఖ్యలు లేవన్నారు. అయినా గుడివాడ క్యాసినోలు..మంత్రుల బూతులను మించినవి చింతామణిలో ఏమున్నాయో చెప్పాలన్న నారాయణ....వాటిపై ప్రభుత్వం ఎందుకు స్పందించలేదన్నారు.