UIDAI on PVC Aadhar : అలాంటి పీవీసీ కార్డులు పనిచేయవ్
PVC Aadhaar కార్డులను తాము మాత్రమే కాకుండా ప్రైవేట్ సంస్థలూ జారీ చేస్తుండటంపై UIDAI ఆందోళన వ్యక్తం చేసింది. బహిరంగ మార్కెట్ లో తయారు చేస్తున్న పీవీసీ ఆధార్ కాపీలను ఉపయోగించడాన్ని నిషేదించింది. అలాంటి కార్డులు ఎలాంటి సెక్యూరిటీ ఫీచర్‌లను కలిగి ఉండవని తెలిపింది. పీవీసీ ఆధార్ కార్డు కావాలంటే రూ.50 చెల్లించి ప్రభుత్వ ఆధార్ ఏజెన్సీ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చని ట్వీట్ చేసింది.