చెప్పులపై పెంచిన జిఎస్టిని వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేసిన సీపిఐ నారాయణ
Continues below advertisement
ఢీల్లీ వెళ్ళి ప్రధానిని కలిసి ఒట్టి చేత్తో సీఎం జగన్మోహన్ రెడ్డి తిరిగి రాకూడదని సీపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.. ఇవాళ తిరుపతి కార్పోరేషన్ కార్యాలయం ఎదుట చెప్పులపై కేంద్ర ప్రభుత్వం పెంచిన జిఎస్టిని వెంటనే తగ్గించాలంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బూట్ పాలిష్ చేస్తూ వినూత్న నిరసన తెలిపారు.. అనంతరం సీపీఐ నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి అవసరమైన ప్రయోజనాలపై పిఎంను అడగాలని డిమాండ్ చేశారు.. ప్రత్యేక హోదా, పెండింగ్ ప్రాజెక్టులపై ప్రశ్నించాలని,చెప్పులపై జిఎస్టీ వేయడం దారుణమని, సామాన్యుడి కష్టాలు తెలుసు కాబట్టే చెప్పులను నెత్తిపై పెట్టుకున్నానని ఆయన మండి పడ్డారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement