CM Jagan : క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్
వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం కింద రాష్ట్రము లో 50 లక్షలకు పైగా రైతులకు 1,036 కోట్ల నిధులు విడుదల కానున్నాయి. నిధులు నేరుగా రైతుల ఖాతాలోకి జమ కానున్నాయి. రైతు భరోసా కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి రూ.13,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. వరసగా మూడవ ఏడాది, మూడవ విడతగా రైతు భరోసా సాయాన్ని క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.