CP Kanthi rana Tata: వంగవీటి రాధా పై రెక్కీ జరిగినట్లు ఆధారాల్లేవు
వంగవీటి రాధా ఇష్యూపై విజయవాడ కమిషనర్ కాంతి రాణా టాటా మాట్లాడారు. రాధాపై హత్యకు రెక్కీ జరిగినట్లు ఎలాంటి ప్రాధమిక ఆధారాలు లేవన్న కాంతి రాణా....విజయవాడలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. రాధా ఇచ్చిన సమాచారం తీసుకున్న తర్వాతనే అతనిపై రెక్కీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టమైనందన్న పోలీస్ కమిషనర్...చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోకుండా పోలీసులపై ఆరోపణలు చేయటం సరికాదన్నారు.