బాలీవుడ్ నటి స్వర భాస్కర్ కు కొవిడ్... ఆర్టీపీసీఆర్ లో నిర్ధరణ..
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ కు కరోనా పాజిటివ్ నిర్ధరణైంది. ఇప్పటికే కరీనా కపూర్, ఏక్తా కపూర్, మహేష్ బాబు, మంచు లక్ష్మి, తమన్ కు కొవిడ్ సోకగా తాజాగా స్వర భాస్కర్ కి కూడా పాజిటివ్ వచ్చింది. 'నాకు కరోనా వచ్చింది. ప్రస్తుతం ఐసోలేషన్ లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నన్ను కలిసిన వారంతా టెస్టు చేయించుకోండి,' అంటూ పోస్ట్ చేశారు. ఇప్పటికే రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా సోకినట్లు స్వర భాస్కర్ తెలిపారు.