Covid Deaths: కోవిడ్ మహమ్మారి విలయంలో కన్నుమూసిన గురువులెందరో..
కొవిడ్ మహమ్మారి రెండేళ్ల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో లక్షల మందిని బలి తీసుకుంటోంది. టీకాలు అందుబాటులోకి వచ్చినా...మనిషి రోగనిరోధక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపిస్తూ...ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి పాలిట శాపంగా మారుతోంది. మన దేశంలో ఈ మహమ్మారి చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఫస్ట్ వేవ్ కొంతమేర నియంత్రించగలిగినా...సెకండ్ వేవ్ లో విలయ తాండవమే చేసింది. ఆసుపత్రుల్లో కనీసం పడకలు దొరకక ఎంత మంది నరకయాతన అనుభవించారో వర్ణనాతీతం. బడులు, కాలేజీలకు పూర్తిస్థాయి సెలవులు ప్రకటించారు. లాక్ డౌన్ విధించి వైరస్ ను కట్టడిచేసేందుకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళికలను అనుసరించాయి. అయినప్పటికీ చాలా మరణాలు నమోదయయ్యాయి. రాజ్యసభలో ఎంపీలు మనోజ్ కుమార్ ఝా, అజయ్ కుమార్ భూయాన్ లు కేంద్ర విద్యాశాఖమంత్రిని ఉటంకిస్తూ ఓ ప్రశ్నను అడిగారు. రాష్ట్రాల వారీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఎంత మంది ఉపాధ్యాయులు ఇప్పటివరకూ కొవిడ్ తో మృతి చెందారో డేటా ఇవ్వాలని కోరారు. వారిలో విధులు నిర్వహిస్తూ మరణించిన వారి సంఖ్యను, కేంద్రం అందించిన పరిహారం వివరాలను తెలపాలని కోరారు.