Corona Third Wave: ఐఐటీ మద్రాస్ విశ్లేషణలో కీలక విషయాలు

Continues below advertisement

గత రెండు వారాలుగా కొవిడ్ కేసులను విశ్లేషించిన ఐఐటీ మద్రాస్ బృందం... కీలక విషయాలు వెల్లడించింది. దేశంలో డిసెంబర్ ఆఖరి వారంలో 2.9 వద్ద ఉన్న ఆర్-నాట్ వేల్యూ... జనవరి తొలివారంలో ఏకంగా నాలుగుకు చేరిందని తెలిపింది. రెండో వేవ్ పీక్ దశలో ఉన్నప్పుడు నమోదైన 1.69 కన్నా ఇది చాలా ఎక్కువని పేర్కొంది. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని ఆర్-నాట్ గా పేర్కొంటారు. ప్రస్తుత గణాంకాలు ఏమాత్రం సానుకూల పరిణామం కాదని నిపుణులు చెబుతున్నారు. దేశంలో ప్రస్తుత వేవ్... ఫిబ్రవరి 1 నుంచి 15 మధ్య గరిష్ఠ స్థాయికి చేరుకునే ప్రమాదం ఉందని ఐఐటీ మద్రాస్ హెచ్చరించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram