కేంద్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసన దీక్షలు..
Continues below advertisement
పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ హత్యాయత్నం చేసిందని ఆరోపించారు నెల్లూరు జిల్లా బీజేపీ నేతలు. కేంద్ర పార్టీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. ఈనెల 13 వరకు రోజువారీ నిరసనలు కొనసాగుతాయని చెప్పారు. నెల్లూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద 2 గంటలసేపు మౌన పోరాటం చేపట్టారు. ఎక్కడికక్కడ రోడ్లపై కూర్చుని మౌనంగా ప్రదర్శన చేపట్టారు. పంజాబ్ లో డీజీపీని రీకాల్ చేయాలని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
Continues below advertisement