కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పై ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు
ఆంధ్ర ప్రదేశ్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సమావేశం విజయవాడలో నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర 13 జిల్లాల నుండి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఏపీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడం కోసం ఉద్యోగ సంఘాల నేతల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు..