CM KCR : తమిళనాడు సీఎం స్టాలిన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం కేసీఆర్
తమిళనాడు సీఎం స్టాలిన్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీరంగం రంగనాథస్వామి దర్శనం కోసం కుటుంబ సమేతంగా తమిళనాడు వెళ్లిన కేసీఆర్..స్వామివారి దర్శనం అనంతరం చెన్నైలో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఇరువురి మధ్య దేశ రాజకీయాలు, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చినట్లు సమాచారం. స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ తో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరువురి మధ్య సరదా సంభాషణ నడిచింది.