CM Jagan Review : నూతన విద్యావిధానానికి అనుగుణంగా టీచింగ్ స్టాఫ్ ను నియమించాలి
నూతన విద్యావిధానానికి అనుగణంగా నాడు-నేడు ను సమన్వయం చేస్తూ స్కూళ్లలో వసతులు మెరుగుపర్చాలని సీఎం జగన్ ఆదేశించారు. స్కూళ్ల మ్యాపింగ్ సబ్జెక్టుల వారీ బోధనా సిబ్బంది నియామకం ఉండాలన్న సీఎం....ఇప్పటికే ఏర్పాటు చేసిన వసతుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇంగ్లీషు బోధనపై టీచర్లకు శిక్షణా కార్యక్రమాలను వేగవంతం చేయాలన్న సీఎం...లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ లను వినియోగించుకోవాలని సూచించారు.