CM JAGAN: రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్
రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. వైద్యులు, అధికారులతో సమీక్షను నిర్వహించిన ముఖ్యమంత్రి...రాష్ట్రంలో కేసుల పరిస్థితిని సమీక్షించారు. కొవిడ్ కేసులు నమోదవుతున్నా...ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉందని వైద్యులు తెలిపారు. పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతోందని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన సీఎం...రాష్ట్రంలోని అన్ని జిల్లాలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అవ్వాలన్నారు. ఆసుపత్రుల్లో ఉన్నవారికి మెరుగైన సౌకర్యాలు అందించటంతో పాటు ఆరోగ్యశ్రీని పక్కాగా అమలు చేయాలన్నారు. కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలబడాలన్నారు.