CJI NV RAMANA: ఏపీ రాజ్ భవన్ లో సీజేఐ జస్టిస్ ఎన్వీరమణకు గవర్నర్ తేనీటి విందు

Continues below advertisement

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణకు ఏపీ గవర్నర్ తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ దంపతులు హాజరయ్యారు. మూడు రోజులుగా రాష్ట్ర పర్యటనలో ఉన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ....గవర్నర్ ఆహ్వానం మేరకు ఆదివారం సాయంత్రం రాజ్ భవన్ కు విచ్చేసారు. ఎన్ వి రమణ , శివమాల దంపతులకు రాజ్ భవన్ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా ఘనంగా స్వాగతం పలకగా, సిజేఐ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , సతీమణి భారతి రాజ్ భవన్ కు చేరుకోగా, ముఖ్యమంత్రి సీజేకు ఎదురెళ్లి రాజ్ భవన్ దర్బార్ హాలులోకి తీసుకువచ్చారు.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ జెకె మహేశ్వరి దంపతులు...సీజేఐతో పాటు ఉన్నారు. దర్బారు హాలులో గౌరవ గవర్నర్ తో భేటీ అయిన సుప్రీం సీజే సమకాలీన అంశాలపై చర్చించారు. చివరగా గవర్నర్ , సిఎం, న్యాయమూర్తులతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గ్రూపు ఫోటో దిగారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram