Cinema Tickets rates in AP: ముగిసిన ప్రభుత్వ కమిటీ సమావేశం
సినిమా టిక్కెట్ల ధరలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏపీ సచివాలయంలో సమావేశమైంది. రేట్లపై చర్చించామని, బీ,సీ సెంటర్లలో ధరలను మార్చాల్సి ఉందని కమిటీ సభ్యుడు ముత్యాల రాందాస్ అన్నారు. థియేటర్లలో వసతులు, ఫైర్ నిబంధనలపై చర్చించినట్లు తెలిపారు. వచ్చే సమావేశంలో తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉందని వివరించారు. టికెట్ రేట్లు తగ్గించాలని ప్రతిపాదన ఇచ్చామని ప్రేక్షకుల సంఘం తరఫున గంపా లక్ష్మి తెలిపారు.రేట్ల తగ్గింపు థియేటర్లు ఇబ్బందులు పడుతున్నాయని ఎగ్జిబిటర్ వేమూరి బలరత్నం అన్నారు. నిబంధనల విషయంలో కాస్త వెసులుబాటు కల్పించాలని కోరామన్నారు.