Chittoor Jallikattu: చిత్తూరు జిల్లాలో సంక్రాంతికి ముందే మొదలైన కోలాహలం
Continues below advertisement
చిత్తూరు జిల్లాలో సంక్రాంతి కోలాహలం ముందుగానే వచ్చేసింది. పండుగకన్నా ముందే జల్లికట్టు సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. తిరుపతి రూరల్ మండలంలోని కొత్త శానంబట్ల గ్రామంలో భారీ ఎత్తున జల్లికట్టు వేడుకలు నిర్వహించారు గ్రామస్తులు. ఈ జల్లికట్టు వేడుకలకు దాదాపు 36 గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారని నిర్వాహకులు చెబుతున్నారు.పెద్ద ఎత్తున యువత హాజరై కోడిగిత్తలకు కట్టిన బహుమతులను సొంతం చేసుకునేందుకు ఉత్సాహం చూపించారు. జల్లికట్టులో దాదాపు వివిధ ప్రాంతాల నుండి 100కు పైగా జత ఎద్దులు జల్లికట్టులో పాల్గొన్నాయి.కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గ్రామంలో జల్లికట్టు నిర్వహించేందుకు పోలీసులు ఆంక్షలు పెట్టినా గ్రామస్తులు పట్టించుకోకుండా గ్రామస్తులు నిర్వహించారు.. జల్లికట్టులో కోడిగిత్తలను పట్టుకునే ప్రయత్నంలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Continues below advertisement