China: చైనా కృత్రిమ సూర్యుడు
Continues below advertisement
చైనా తయారు చేసిన కృత్రిమ సూర్యుడు.... ఎక్స్ పెరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టొకమాక్ ఫ్యూజన్ ఎనర్జీ రియాక్టర్ సరికొత్త రికార్డు సృష్టించింది. సూర్యుడిలో శక్తి ఉత్పత్తి ప్రక్రియను అనుకరించే ఈ రియాక్టర్... తాజాగా 1056 సెకండ్ల పాటు ఏడు కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను సృష్టించింది. సూర్యుడి వేడి 1.5 కోట్ల డిగ్రీల సెల్సియస్ తో పోలిస్తే ఇది దాదాపు అయిదు రెట్లు ఎక్కువని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లోని పరిశోధకులు తెలిపారు. డ్యుటేరియం వినియోగంతో సూర్యుడిలో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియను అనుకరించి స్వచ్ఛమైన శక్తిని ఉత్పన్నం చేయడమే తమ ఉద్దేశమన్నారు.
Continues below advertisement