Chaos in a meeting: ఆర్యవైశ్య ఐక్యవేదిక సభలో గందరగోళం

విజయవాడలోని MBVK భవన్‌లో ఆర్యవైశ్య ఐక్యవేదిక సభలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ఈ ఐక్యవేదిక తెలుగుదేశం ఐక్యవేదికలా ఉందని నందిగామకు చెందిన ఆర్యవైశ్య నాయకుడు పార్ధసారథి వ్యాఖ్యానించటంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. కర్నూలు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కల్పించుకుని... ఇది కేవలం వైశ్యుల‌ సభ మాత్రమేనన్నారు. రాజకీయాలకు సంబంధం లేదన్నారు. వైశ్య కులానికి చెందిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అంటే గౌరవమని తెలిపారు. రాజకీయాలు బయట చూసుకుందామని, సభలో గందరగోళం సృష్టించాలని చూస్తే నాలుక కోస్తామని మరికొందరు హెచ్చరించటంతో కాసేపు స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola