Chandra Babu Naidu: 175 నియోజకవర్గాల పార్టీ ఇన్ చార్జ్ లతో చంద్రబాబు సమావేశం
టీడీపీ శ్రేణులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో 175 నియోజకవర్గాల ఇంఛార్జిలతో చంద్రబాబు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన....ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. సీఎంగానే గెలిచిన తర్వాత తిరిగి అసెంబ్లీలో అడుగుపెడతానని నాయకులంతా కార్యకర్తలకు అండగా నిలబడాలని సూచించారు.