Celebrities on Vaikuntha Ekadasi: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadasi) పర్వదినం సందర్భంగా తిరుమల క్షేత్రం గోవింద నామస్మరణలతో మారుమోగుతోంది. తెల్లవారుజాము నుంచే పలువురు ప్రముఖులు సైతం దర్శించుకుంటున్నారు. ఏపీ,తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక హైకోర్టు సీజేలు, ఏపీ మంత్రులు నారాయణస్వామి, వెల్లంపల్లి, అనిల్, అవంతి, అప్పలరాజు, సురేష్ తదితరులు వైకుంఠద్వారం ద్వారా ప్రవేశించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ మంత్రులు హరీష్ రావు, తలసాని, గంగుల కమలాకర్ సహా మరికొందరు ప్రముఖులు శ్రీవారిని సేవించుకున్నారు. కొందరు సినీ ప్రముఖులు సైతం వేంకటేశుడిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారందరికీ స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.