CDS Bipin Rawat: డిసెంబర్ 7న ఇండియన్ ఆర్మీ రికార్డ్ చేసిన బిపిన్ రావత్ ఆఖరి వీడియో
భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ చివరి సందేశాన్ని భారత సైన్యం విడుదల చేసింది. 1971లో పాకిస్థాన్‌పై జరిగిన యుద్ధంలో భారత విజయానికి గుర్తుగా దిల్లీలో ఈరోజు నిర్వహించిన 'స్వర్ణిమ్ విజయ్ పర్వ్' కార్యక్రమంలో బిపిన్ రావత్ చివరి వీడియో సందేశాన్ని ప్రసారం చేశారు. 1971 ఇండియా-పాక్ యుద్ధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం దిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగింది. డిసెంబరు 7న రికార్డు చేసిన ఈ వీడియోలో ఆ యుద్ధంలో అమరులైన సైనికులకు రావత్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు ఆర్మీ అధికారులు పాల్గొన్నారు. బిపిన్ రావత్ అకాల మరణం వల్ల ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా చేస్తున్నట్లు రాజ్‌నాథ్ పేర్కొన్నారు.