Jagan News : జగన్ గెలుస్తారా..? రఘురామ వదులుతారా.. ?
Continues below advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టి వేసింది. వారు బెయిల్ షరుతులు ఉల్లంఘించారన్న రఘురామకృష్ణరాజు వాదనలతో సీబీఐ కోర్టు ఏకీభవించలేదు. రాజకీయ ఉద్దేశాలతోనే రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారన్న జగన్ లాయర్ల వాదనలతో ఏకీభవించిన సీబీఐ కోర్టు ఆ పిటిషన్లను కొట్టి వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో సీఎం జగన్,విజయ సాయిరెడ్డిలకు ఊరట లభించినట్లయింది
Continues below advertisement