Caste Deportation : పదిహేనేళ్లుగా ఆ తండాలో కొనసాగుతున్న కుల బహిష్కరణ
తమను అకారణంగా కుల బహిష్కరణ చేసారని ఆరోపిస్తూ కలెక్టరేట్ కు తరలి వచ్చిన గాంధారి మండలం గుర్జాల్ తండా వాసులు. 2006 నుంచి కుల బహిష్కరణ చేసారని తండా వాసుల ఆరోపిస్తున్నారు. గ్రామ సర్పంచ్ తమపై బహిష్కరణ వేటు వేసి మమ్మల్ని ఏ కార్యక్రమానికి ఆహ్వానించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తండా వాసులు. కులబహిష్కరణకు గురి చేసి తమను చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు బహిష్కరణకు గురైన బాధితులు. సర్పంచ్, ఉప సర్పంచులను సస్పెండ్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు తండా వాసులు..