Captain KL Rahul: సౌతాఫ్రికాతో రెండో టెస్టు లో టీమిండియాకు షాక్...మారిన కెప్టెన్|
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో టీమ్‌ఇండియాకు షాక్ తగిలింది! కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటం లేదు. వెన్నునొప్పి కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ భారత్‌కు సారథ్యం వహిస్తున్నాడు. కఠినమైన వాండరర్స్ పిచ్‌పై విరాట్ లేకపోవడం ఇబ్బందికరమే!టాస్ సమయంలో విరాట్ కోహ్లీ బదులు కేఎల్ రాహుల్ మైదానంలోకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. విరాట్ ఎందుకు రావడం లేదో ఎవరికీ అర్థం కాలేదు. అయితే టాస్ గెలిచిన తర్వాత కేఎల్ రాహుల్ అసలు కారణం చెప్పాడు. విరాట్ వెన్నునొప్పితో బాధపడుతున్నాడని వివరించాడు. అతడిని ఫిజియోలు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నాడు. బహుశా మూడో టెస్టు లోపు కోలుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు. అతడి స్థానాన్ని హనుమ విహారి భర్తీ చేస్తున్నాడని వెల్లడించాడు.