Builder Vijayalakshmi : మేడ్చల్ జిల్లా మల్లంపేటలో ఓ రియల్టర్ కు పోలీసుల షాక్
మేడ్చల్ జిల్లా మల్లంపేట లో 260 అక్రమ విల్లాలు నిర్మించారనే ఆరోపనలపై బిల్డర్ విజయలక్ష్మి కి దుండిగల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న విజయలక్ష్మి.... వారంలోగా తమ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపించారు. విజయలక్ష్మి పై చెరువు బఫర్ జోన్ లో విల్లాలు నిర్మించినందుకు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు మేరకు గతంలో కేసు నమోదు చేశారు. దుండిగల్ మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు వారం క్రితం మరో చీటింగ్ కేసు నమోదు చేసిన దుండిగల్ పోలీసులు నోటీసులు పంపించారు.