Budget 2022|Good News For Farmers|రైతులకు తీపికబురు చెప్పిన Nirmala Sitharaman
Continues below advertisement
బడ్జెట్ సమావేశాల్లో రైతులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. రైతుల నుంచి 1,208 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ‘‘మొదటి దశలో గంగా నది వెంట 5 కిలో మీటర్ల పరిధిలో గల రైతుల భూములపై దృష్టి సారించి కెమికల్ ఫ్రీ వ్యవసాయాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తాం. 2021-22 రబీ సీజన్‌లో గోధుమ ధాన్యం సేకరణ, ఖరీఫ్ సీజన్ 2021-22లో వరి ధాన్య సేకరణ అంచనా ప్రకారం 163 లక్షల మంది రైతుల నుంచి 1,208 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు, వరిని కొంటాం. రూ. 2.37 లక్షల కోట్లు నేరుగా వారికి మద్దతు విలువ ద్వారా చెల్లిస్తామని నిర్మలా తెలిపారు.
Continues below advertisement