అమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనం

Continues below advertisement

ఆదానీ గ్రూప్ ఫౌండర్ అండ్ ఛైర్మన్ గౌతమ్ ఆదానీపైన అమెరికాలో కేసు నమోదైంది. ఆయనతో పాటు ఇంకో ఏడుగురిపైన కూడా ఈ కేసు ఉంది. Foreign Corrupt Practices Act ని ఉల్లంఘించారని, అమెరికాలోని investors ని manipulate చేశారని.. మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇండియాలో సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్‌ల కోసం.. ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్‌ నుంచి 3 బిలియన్ డాలర్స్ అంటే.. 25 వేల కోట్ల దాకా raise చేయడానికి వారిని తప్పుదోవ పట్టించేలా చేశారని అంటున్నారు. US justice department website లోని నేరారోపణల ప్రకారం, ఆదానీతో పాటు ఏడుగురు నిందితులు 2020 నుంచి 2024 మధ్యకాలంలో భారత ప్రభుత్వ అధికారులకు $250 మిలియన్ డాలర్స్ కు పైగా లంచాలు చెల్లించారని పేర్కొన్నారు. ఫలితంగా లాభదాయకమైన energy contracts ను పొంది.. రాబోయే 20 ఏళ్లలో $2 బిలియన్ డాలర్ల పోస్ట్-టాక్స్ profits ఆర్జించవచ్చని అంచనా వేశారు. లంచం, అవినీతి ఆరోపణల్లో భాగంగా గౌతమ్ అదానీ జోక్యం నేరుగా ఉంది. ఈ లంచం కోసం ఆయన ఇండియన్ అఫీషియల్స్ తో పర్సనల్ మీటింగ్స్ కూడా నిర్వహించినట్లు రిపోర్ట్ లో ఉంది. దీనికి సంబంధించి వివిధ రకాల Evidence కూడా సేకరించారు. ఆదానీ గ్రూప్‌లో ఆదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనే కంపెనీ కూడా ఉంది. దీంతో పాటు మరో కంపెనీ కలిసి 12 గిగావాట్ల సోలార్ పవర్‌ను భారత ప్రభుత్వానికి విక్రయించడానికి చేసిన ఒక ఒప్పందం చుట్టూ ఈ కేసు తిరుగుతుంది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram