ఏఆర్ రెహమాన్ విడాకులు, 29 ఏళ్ల బంధానికి ముగింపు

ప్రసిద్ధ మ్యూజిక్ డైరెక్టర్, ఇండియాలోనే తొలి ఆస్కార్‌ అవార్డు విజేత ఏఆర్‌ రెహమాన్‌ దంపతులు విడాకులు తీసుకుంటున్నారు. ఇద్దరం పరస్పర అంగీకారంతో తాను, తన భార్య సైరా బాను వీడిపోతున్నట్లు రెహమాన్‌ ప్రకటించారు. ఆ దంపతుల తరఫున ప్రముఖ లాయర్‌ వందనా షా ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు, ఇబ్బందులు వారి మధ్య అధిగమించలేని దూరాన్ని సృష్టించాయని లాయర్‌ వందనా షా అన్నారు.  రెహమాన్‌ దంపతులకు పెళ్లి జరిగి.. 29 ఏళ్లు. 1995లో వీరు పెళ్లి చేసుకోగా.. వీరికి ఖతీజా, రహీమా, అమీన్‌ పిల్లలు ఉన్నారు. 

విడాకులపై ఏఆర్‌ రెహమాన్‌ స్పందించారు. తమ వైవాహిక బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుతుందని సంతోషించామని.. కానీ అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చిందని అన్నారు. పగిలిన తమ హ్రుదయాలు మళ్లీ యథావిధంగా అతుక్కోలేవని.. అయినప్పటికీ తమ దారుల్లో అర్థాన్ని వెతుక్కుంటామని అన్నారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని రెహమాన్ ఎక్స్‌ లో ఓ పోస్టు చేశారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola