మెగాస్టార్ కోసం.. కలిసిన మమ్ముట్టి-మోహన్ లాల్ టీమ్స్

మలయాళ అగ్ర నటులు మమ్ముట్టి, మోహన్ లాల్ దాదాపు 16 ఏళ్ల తర్వాత ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ‘మెగాస్టార్‌ 429’ అనే వర్కింగ్‌ టైటిల్‌ తో షూట్ అవుతుంది. దీనికి డైరెక్టర్ మహేశ్‌ నారాయణ్‌. ఇటీవలే స్క్రిప్ట్‌ పనులు పూర్తి చేసుకోగా.. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ శ్రీలంకలో ప్రారంభించుకున్నారు.  ఇందులో మమ్ముట్టి లీడ్ రోల్ లో నటిస్తుండగా.. మోహన్‌లాల్‌ అతిథి పాత్రలో మెరవనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా దక్షిణాదికి చెందిన ఓ నటితో టీమ్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మోహన్‌లాల్, మమ్ముట్టి కాంబినేషన్‌లో దాదాపు యాభైకి పైగా సినిమాలు వచ్చాయి. 2008లో రిలీజైన ‘ట్వంటీ 20’ చిత్రం తర్వాత మోహన్‌లాల్, మమ్ముట్టి కలిసి ఓ పుల్‌ లెంగ్త్‌ సినిమా చేయలేదు. మమ్ముట్టి హీరోగా ‘కాదల్‌ కదన్ను ఒరు మాతుకుట్టి’ (2013) చిత్రంలో మోహన్‌లాల్‌ నటించారు. కానీ ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ది జస్ట్ గెస్ట్ అప్పియరెన్స్. ఈ ఇద్దరు స్టార్స్‌ కలిసి చాలా గ్యాప్‌ తర్వాత చేస్తున్న తాజా ఫుల్‌ లెంగ్త్‌ చిత్రంపై అంచనాలు ఉన్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola