Brazil tragic accident: బ్రెజిల్ లోని ఓ సరస్సులో ఘోర ప్రమాదం
బ్రెజిల్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బ్రెజిలియన్ సరస్సులో పడవలో ప్రయాణిస్తున్నవారిపై ఒక్కసారిగా కొండచరియలు విరిగి పడిపోవడంతో ఏడుగురు మరణించారు. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారని అక్కడి అధికారులు తెలిపారు. శనివారం ఆగ్నేయ బ్రెజిల్‌లో నిమినాస్ గెరైస్ రాష్ట్రంలోని కాపిటోలియో వద్ద ఉన్న సరస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది.