BJP vs TMC: పశ్చిమబంగాల్ లో మళ్లీ అధికార, ప్రతిపక్షాల మధ్య గొడవ | ABP Desam
పశ్చిమ బంగాల్ లోని భట్పారాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకల సందర్భంగా బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగేందుకు యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వాళ్లను విడగొట్టేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఘటనపై మాట్లాడిన పశ్చిమబంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు అర్జున్ సింగ్.... తమ పార్టీ ఎమ్మెల్యేపై టీఎంసీ నేతలు దాడికి దిగారని ఆరోపించారు. తాను అక్కడికి వెళ్లాక తనపైనా దాడికి దిగారన్నారు. తన కారు విరిగిపోయిందని, ఇదంతా పోలీసుల ముందే జరిగిందన్నారు.