BJP Protest: ఉద్యోగులకు సంఘీభావంగా బీజేపీ నాయకుల నిరసన |
CM Jagan దగ్గర ఓ ముఠా చేరిందని, వారే ఆయనకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని BJP రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. తమ డిమాండ్ల సాధనకు ఉద్యోగులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా బీజేపీ కార్యాలయంలో మరికొందరు నేతలతో కలిసి సోము నిరసన చేపట్టారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్లపై తిరిగి, ఇప్పుడు ప్యాలెస్ లో కూర్చుని జనాలను రోడ్లు ఎక్కిస్తున్నారని మండిపడ్డారు.