BJP : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కోర్టు లో హాజరు పర్చనున్న పోలీసులు
Continues below advertisement
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జీ ఓ 317 సవరించాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన దీక్ష కరీంనగర్ లోని తన కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తతకి దారితీసింది. ఒకవైపు వందల సంఖ్యలో వస్తున్న కార్యకర్తలను పట్టణం చుట్టూ మోహరించి మరీ అరెస్టు చేసిన పోలీసులకు అప్పటికే బండి సంజయ్ కార్యాలయం వద్ద దీక్షకు దిగిన నాయకులను కార్యకర్తలను అదుపు చేయలేక తీవ్ర గందరగోళ పరిస్థితులకు దారితీశాయి. అప్పటివరకు దీక్షలో సంజయ్ లేడంటూ కాస్త ఊపిరిపీల్చుకున్న పోలీసులకు ఆకస్మికంగా బండి సంజయ్ బైక్ పై రావడంతో కార్యకర్తలను అదుపు చేయడం సాధ్యం కాలేదు.
Continues below advertisement