BJP Leader Madhav On AP Government : ఏపీ ఆర్థిక పరిస్థితిపై భాజపా నాయకుడు విమర్శలు
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై భాజపా నాయకుడు మాధవ్ విమర్శలు చేశారు. తిరుపతిలో మాట్లాడిన ఆయన.... పింఛన్, ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. కేంద్రం వద్ద సీఎం జగన్ చేయి చాచారన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులను నమ్మించి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సినిమా టికెట్ల ధర తగ్గించి ఎవరినో ఇబ్బంది పెడుతున్నారని, నిత్యావసరాల రేట్లు పెంచి ప్రజలను కోలుకోలేని దెబ్బ తీస్తున్నారని ఆగ్రహించారు.