BJP: బీజేపీ నేత వాహనాన్ని తగలబెట్టిన ఆందోళనకారులు.. పరిస్థితి ఉద్రిక్తం
కర్నూలు జిల్లాలోని ఆత్మకూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పద్మావతి స్కూల్ వెనకున్న మసీదు నిర్మాణ విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. శ్రీశైలం నియోజకవర్గ బీజేపి ఇన్ ఛార్జి బుడ్డా శ్రీకాంత్ రెడ్డి వాహనంపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో అద్దాలు ధ్వంసమవ్వగా.. శ్రీకాంత్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని పోలీసులు స్టేషన్‌కు తరలించగా మైనార్టీలు ముట్టడించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెండు వర్గాల వారిని పోలీసులు చెదరగొట్టారు. ఇందుకోసం గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు పోలీసులు.