నెల్లూరు లో పోలీసుల కన్నుగప్పి పోలీస్ స్టేషన్ నుంచే బైక్ లు దొంగతనం

నెల్లూరు జిల్లా కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రెండు బైక్ లు చోరీకి గురైన ఘటనలో పోలీసులు రాజేంద్ర కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కావలి పట్టణంలో పలువురు లాయర్ల వద్ద గమస్తాగా పనిచేస్తూ రోజూ పోలీస్ స్టేషన్ కి వచ్చి వెళ్తుండేవాడు రాజేంద్ర కుమార్. ఈ నేపథ్యంలో ఎవరికా అనుమానం రాకుండా, సెంట్రీ భోజనానికి వెళ్లిన సమయంలో బైక్ లు చోరీ చేసుకుని వెళ్లిపోయేవాడు. రెండోసారి పోలీసులు చూసినా.. తెలిసిన వ్యక్తి కావడంతో అనుమానం రాలేదు. తీరా ఆడిటింగ్ సమయంలో బైక్ లు పోయినట్టు గుర్తించి నిఘా పెట్టి రాజేంద్ర కుమార్ ని అరెస్ట్ చేశారు. బైక్ లు స్వాధీనం చేసుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola