Bheemadolu Poojari: భీమడోలు సంతమార్కెట్ కామాక్షమ్మ ఆలయపూజారి ఆత్మహత్యాయత్నం
పశ్చమగోదావరి జిల్లా భీమడోలు సంతమార్కెట్ వద్ద ఆలయ భూమి వివాదం రాజేస్తోంది. కామాక్షమ్మ ఆలయానికి 30ఏళ్లుగా రామలింగాచారి అనే వృద్ధుడు పూజారిగా ఉండగా....ఆలయ భూమిని ఆక్రమించుకుని రేకులషెడ్డు వేసుకున్నారని పంచాయతీ సర్పంచ్ భర్త ఆరోపించారు. అంతేకాకుండా పంచాయతీ సిబ్బందితో ఆక్రమణలను
తొలగించారు. దీంతో మనస్తాపం చెందిన ఆలయ పూజారి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో భీమడోలు ప్రభుత్వ
ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యా యత్నం చేసినా వెనక్కి తగ్గని పంచాయతీ సిబ్బంది..రేకుల షెడ్డును నేలమట్టం చేశారు.
Tags :
Bheema Dolu Pujari