Bhala Tandanana Teaser: ఆకట్టుకుంటున్న భళా తందనానా టీజర్
శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'భళా తందనానా'. 'బాణం' ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేతరిన్ థ్రెసా ప్రధానపాత్ర పోషిస్తున్నారు. సినిమా టీజర్ ను ఇవాళ విడుదల చేశారు. నిజాయతీగా ఉండే హీరో, హీరోయిన్ అవినీతిపై ఎలా పోరాటం చేశారన్నది కథ అనిపిస్తోంది. మళ్లీ ఆటకొస్తున్నాను! ఈసారి నాకు, జోకర్ పడింది అంటూ క్యాప్షన్ పెట్టి శ్రీవిష్ణు తన సోషల్ మీడియాలో టీజర్ గురించి పోస్ట్ చేశారు.