9 yrs Boy: 'ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్'గా రికార్డుకెక్కిన 9 ఏళ్ల నైజీరియన్.
9 సంవత్సరాల వయస్సులో, మనలో చాలా మందికి బిలియన్ అంటే పెద్దగా తెలియదు. అయితే ఈ 9 ఏళ్ల నైజీరియన్ పిల్లవాడు మాత్రం 'ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్'గా రికార్డ్ ఎక్కేసాడు. ముహమ్మద్ అవల్ ముస్తఫా ఆకా మోంఫా జూనియర్, రిచీ రిచ్ జీవితాన్ని గడుపుతున్నాడు. అతను ఆరేళ్ల వయసులో తన మొదటి భవనాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు మోంఫా ఎక్కడికెళ్లాలన్న తన సొంత ప్రైవేట్ జెట్ లో వెళ్తాడు.అన్ని రకాల సూపర్ మోడల్ కార్లన్నీ తన వద్ద వున్నాయ్.నైజీరియాలోని లాగోస్, మోంఫా జూనియర్ నుండి వచ్చిన మల్టీమిలియనీర్, నైజీరియన్ ఇంటర్నెట్ సెలబ్రిటీ ఇస్మాలియా ముస్తఫా, ముహమ్మద్ అవల్ ముస్తఫా కుమారుడే మోంఫా జూనియర్. ఈ యువ ఇన్‌ఫ్లుయెన్సర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 30K ఫాలోవర్లు కలిగి ఉన్నాడు