BBL Incident: పెద్ద చర్చకు దారి తీసిన ఆసక్తికర ఘటన..

క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహిస్తున్న Big Bash Leagueలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఫైనల్ బెర్తు కోసం ఆఖరి ప్లే-ఆఫ్స్ లో Sydney Sixers, Adelaide Strikers తలపడ్డాయి. ఛేజింగ్ చేస్తున్న సిడ్నీ జట్టు... ఆఖరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉంది. స్ట్రైకింగ్ లో Hayden Kerr, నాన్ స్ట్రైకింగ్ వద్ద Jordan Silk ఉన్నారు. అయితే అంతకుముందు నుంచే సిల్క్ Hamstring గాయంతో బాధపడుతున్నాడు. కానీ కరెక్ట్ గా లాస్ట్ బాల్ కే అతణ్ని Retired Hurtగా జట్టు వెనక్కి పిలిచింది. మరో కొత్త ఆటగాడ్ని క్రీజు వద్దకు పంపింది. చివరి బంతికి బౌండరీ కొట్టి సిడ్నీ మ్యాచ్ గెలిచినా... ఇలా ఆఖరి బంతికి నాన్-స్ట్రైకర్ ని మార్చడం చర్చకు దారి తీసింది. కొందరు ఇది రూల్స్ ప్రకారమే జరిగిందని చెబుతున్నా... మరికొందరు రూల్స్ లో ఉన్నప్పటికీ ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola