Vikramarka: పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య విషాదంపై స్పందించిన మల్లుభట్టివిక్రమార్క
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదాన్ని నెలకొల్పంది. అయితే రామకృష్ణ ఆత్మహత్య చేసుకునేలా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వేంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ వేధింపులు కారణమయ్యాయని మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. ఆత్మహత్యాయత్నంలో గాయాలతో బయటపడిన రామకృష్ణ చిన్న కుమార్తెను కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించిన ఆయన జరిగిన ఘటనకు కారణం ఎమ్మెల్యే కుమారుడేనన్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోవాలని మల్లు భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు.