Basara Temple: సరస్వతి అమ్మవారి పుట్టిన రోజు సందర్భంగా ఆలయానికి పోటెత్తిన భక్తులు.
నిర్మల్ జిల్లా బాసర సరస్వతి దేవాలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు సరస్వతి అమ్మవారి పుట్టిన రోజు సందర్భంగా భక్తులు ఆలయానికి పోటెత్తారు. వేకువ జాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. భారీ సంఖ్యలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంద్రప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది ఆలయ సిబ్బంది.