Basara Saraswathi Temple History: విద్యాబుద్ధులకు నిలయం బాసర జ్ఞానసరస్వతీ ఆలయం

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో ఉంది బాసర. పవిత్ర గోదావరి తీరాన ఉన్న ఈ పుణ్యక్షేత్రమే చదువుల తల్లి సరస్వతి దేవికి నిలయం. వ్యాస మహర్షి కాశీని వీడి దక్షిణా పథాన ప్రయాణిస్తూ గోదావరి తీరాన నివసించి ఇక్కడి ప్రకృతి శోభకు పరవశించి శారదాంబను ప్రతిష్టించారు వ్యాస మహర్షి. అలా వ్యాస మహర్షి పేరు మీద బాసర గ్రామానికి వ్యాసపురి అనే పేరు కూడా వచ్చింది. క్రమంగా వ్యాసపురి కాస్త వాసర గా.... బాసరగా రూపాంతరం చెందిందని స్థలపురాణం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola