Bandi Srinivasarao: చీకటి జీవోలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్
PRC సాధన సమితి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగులను సిద్ధం చేసేందుకు రాష్ట్ర కమిటీ జిల్లాల్లో పర్యటిస్తోంది. నెల్లూరులో APNGO అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పర్యటించారు. నగరంలో బైక్ ర్యాలీ చేపట్టారు. అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ బయటపెట్టాలని, చీకటి జీవోలు రద్దు చేసి పాత PRC ప్రకారం జీతాలివ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే లక్షల్లో ఉద్యోగులు విజయవాడను చుట్టుముట్టి తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు.