Bandi Sanjay : బండిసంజయ్ కి, బీజేపీకి జైళ్లు కొత్తకాదు..ధర్మయుద్ధం మొదలైంది
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ పై విడుదల అయ్యారు. కరీంనగర్ జిల్లా జైలు నుంచి బయటకు వచ్చిన బండి....సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. జైళ్లు తనకు, బీజేపీకి కొత్త కాదన్న బండి సంజయ్....కేసీఆర్ ను వదిలే ప్రసక్తే లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ జైలుకు పోతే ఎవరూ కాపాడలేరన్న కరీంనగర్ ఎంపీ...317 జీవోను ప్రభుత్వం సవరించాల్సిందేనన్నారు. ఇందుకోసం అందరూ ఐక్యంగా ధర్మయుద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు.