Bandi Sanjay Arrest: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాగరణ దీక్ష భగ్నం..అరెస్ట్

కరీంనగర్ లో ఎంపీ బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్ష తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలీసులు భగ్నం చేశారు. తొలుత కొవిడ్ నిబంధనలతో బండి సంజయ్ దీక్షకు అనుమతి లేదన్న పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. కరీంనగర్ ఎంపీ క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి బండి సంజయ్ దీక్షకు దిగగా...పోలీసులు తలుపులు బద్దలు కొట్టి మరీ బండిని బయటికి లాక్కొచ్చారు. బయట కార్యకర్తలను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. ప్రభుత్వ 317జీవోను సవరించాలని కోరుతూ బండి సంజయ్ జాగరణ దీక్షను ప్రారంభించగా.. తీవ్ర ఉద్రిక్తతల మధ్య బండిని అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్ లో తరలించారు పోలీసులు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola