Bandi Sanjay: కరీంనగర్ లో ఎంపీ బండి సంజయ్ కార్యాలయం వద్ద భారీగా మొహరించిన పోలీసులు
కరీంనగర్ లో ఎంపీ బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్ష తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రారంభమైంది. ప్రభుత్వ 317జీవోను సవరించాలని కోరుతూ బండి సంజయ్ జాగరణ దీక్షను ప్రారంభించగా....అనుమతి లేదంటూ ఎంపీ క్యాంప్ ఆఫీసుకు పెద్దఎత్తున పోలీసులు మొహరించారు. బండిపై క్యాంప్ ఆఫీసుకు వచ్చిన బండిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించగా...కార్యకర్తలు అడ్డుకుని రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య బండి సంజయ్ జాగరణ దీక్ష ప్రారంభమైంది. కొంత మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.