Balakrishna Visits Hindupuram |ముంపు ప్రాంతాల వారికి అండగా ఉంటామన్నబాలకృష్ణ |ABP Desam
ఇటీవల కురుస్తున్న భారీ వర్షలతో హిందూపురం వరద ముంపు గురైంది. నాలుగైదు రోజులుగా ప్రజలు వరద నీటితో ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలోనే.. హిందూపురం ముంపు ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. చౌడేశ్వరి కాలనీ, శాంతినగర్, ఆర్టీసీ కాలనీ, త్యాగరాజు నగర్ లను పరిశీలించారు. ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. బాధితుల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని బాలకృష్ణ హామీ ఇచ్చారు.